Sukhbir Singh Badal Resigns : శిరోమణి అకాళీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేశారు. అకాల్ తఖ్త్ తనను 'తంఖయ్య'గా (మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిగా) ప్రకటించిన నేపథ్యంలోనే సుఖ్బీర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సుఖ్బీర్ రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి మార్గం సుగమం అయ్యింది.
వాస్తవానికి సుఖ్బీర్ను తంఖయ్యగా ప్రకటించి 2 నెలలకుపైనే అయినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష విధించలేదు. కానీ అకల్ తఖ్త్ నుంచి ఆయన ఎలాంటి ఉపశమనం పొందలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 24న జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేయలేదు. జులై 1న మాజీ ఎంపీ ప్రేమ్ సింగ్ చందుమజ్రా, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ మాజీ చీఫ్ బీబీ జాగీర్ కౌర్ సహా తిరుగుబాటు నాయకులు అందరూ అకల్ తఖ్త్ ముందు హాజరయ్యి 2007-17 మధ్య తాము చేసిన తప్పులకు క్షమాపణలు కోరారు.