national

'బ్రాండెడ్' షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 7:16 AM IST

Footwear Thieves Arrested Karnataka
Footwear Thieves Arrested Karnataka (ETV Bharat)

Footwear Thieves Arrested Karnataka :మనం ఇప్పటి వరకు బంగారం, నగదు, చైన్​, బైక్ వంటివి ఎత్తుకెళ్లే దొంగలనే చూశాం. కానీ బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం బ్రాండెడ్​ షూస్​​నే టార్గెట్​గా పెట్టుకున్నారు. గత ఏడేళ్లుగా దొంగలించిన షూస్​ను కొత్తవిగా మార్చి బెంగళూరు, చెన్నై, ఊటీ నగరాల్లో విక్రయిస్తున్నారు. షూస్​తో పాటు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, వాహనాల బ్యాటరీలు, సిలిండర్లు కూడా చోరీ చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై బెంగళూరులోని విద్యారణ్యపుర్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు కాగా, ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.72లక్షల విలువైన 715 బ్రాండెడ్​ షూస్​ జతలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details