ETV Bharat / snippets

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుంటూనే 'వేణుగానం' చేసిన పేషెంట్​

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Brain Surgery While Playing Flute
Brain Surgery While Playing Flute (ETV Bharat)

Brain Surgery While Playing Flute : బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తి శస్త్ర చికిత్స చేయించుకుంటూనే వేణుగానం వినిపిస్తూ వైద్యులను రంజింపజేశారు. కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని కొల్లాపుర కన్హేరి మఠానికి చెందిన సిద్ధగిరి హాస్పిటల్​లో గురువారం ఈ ఆపరేషన్‌ జరిగింది. శస్త్రచికిత్స జరిగిన 5 గంటల పాటు సదరు వ్యక్తి వేణుగానం చేస్తూనే ఉన్నారు. నరాల వ్యాధుల నిపుణుడు శివశంకర్, మత్తుమందు విభాగ వైద్యుడు ప్రకాశ భరమగౌడ నేతృత్వంలో వైద్యులు ఆ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడు నిర్వహించే ఈ శస్త్రచికిత్సను అవేక్‌ క్రేనియాటమీగా వ్యవహరిస్తారని శివశంకర్‌ తెలిపారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులను మఠాధిపతి అదశ్య కాడసిద్ధేశ్వర స్వామి అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.