Devara Special Shows : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'దేవర' మూవీ సెప్టెంబరు 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోస్, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. మరి షోలు ఎప్పుడు పడనున్నాయి? టికెట్ ధరలు ఎంత పెరగనున్నాయంటే?
29 థియేటర్లలో సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 1 గంట స్పెషల్ షో పడనుంది. ఇక అన్ని థియేటర్లలో తొలి రోజు 6 షో లు (4 గంటల నుంచి ప్రారంభం) ప్రదర్శించేందుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ. 100 పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, అటు ఏపీలోనూ స్పెషల్ షోలు, టికెట్ ధర పెంపునకు కూడా అక్కడి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే!
నైజాం ఏరియాలో 'దేవర' టికెట్లు రూ.45 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. గతంలో ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను అందుకున్నాయి.ఈ క్రమంలో ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సుమారు రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉండగా, వైజాగ్‌లో రూ.12.5 కోట్లు, ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.6 కోట్లు, కృష్ణా రూ. 7 కోట్లు, గుంటూరు రూ. 8.5 కోట్లు, నెల్లూరు రూ. 4 కోట్లు అని టాక్ నడుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. కర్ణాటకలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారట. అక్కడ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిందట. తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్‌లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.15 కోట్లు అని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.
'దేవర' అనే టైటిల్ అందుకే పెట్టాం : ఎన్టీఆర్ - NTR Comments on Devara Title
'దేవర' ఖాతాలో మరో సూపర్ రికార్డు - ఆ విషయంలో తొలి తెలుగు సినిమాగా ఘనత - Devara Movie Record