ETV Bharat / technology

10 నిమిషాల్లోనే 'ఐఫోన్‌ 16' డెలివరీ- యాపిల్ ప్రియులకు ఇక పండగే! - iphone 16 Delivery in 10 Minutes - IPHONE 16 DELIVERY IN 10 MINUTES

iphone 16 Delivery in 10 Minutes: ఐఫోన్ ప్రియులకు టాటాగ్రూప్‌ శుభవార్త తెచ్చింది. ఐఫోన్‌ 16ను కేవలం పది నిమిషాల్లో కస్టమర్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం బిగ్‌బాస్కట్‌ను రంగంలోకి దింపింది. ఈ సేవలు ఎప్పటినుంచంటే?

iphone_16_Delivery_in_10_Minutes
iphone_16_Delivery_in_10_Minutes (ANI)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 20, 2024, 2:04 PM IST

Updated : Sep 20, 2024, 2:18 PM IST

iphone 16 Delivery in 10 Minutes: యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూవీ రిలీజ్ రోజు టికెట్ల కోసం యుద్ధం చేసినట్లుగా వీటి కోసం కస్టమర్లు దేశవ్యాప్తంగా పలు యాపిల్‌ స్టోర్‌ల ముందు పెద్దఎత్తున క్యూలు కట్టారు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్స్ వేగవంతమైన డెలివరీలపై టాటాగ్రూప్‌ సరికొత్త ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఐఫోన్‌ 16ను కేవలం పది నిమిషాల్లో కస్టమర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఇందుకోసం తమ నిత్యావసరాల సరఫరా యాప్‌ బిగ్‌ బాస్కెట్​ను రంగంలోకి దించింది. వీటిని నిమిషాల్లో డెలివరీ చేయించేందుకు ఎలక్ట్రానిక్‌ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేయనుంది. మొత్తం మీద 10 నిమిషాల్లో కస్టమర్ చేతికి ఐఫోన్‌ 16 అందించనున్నారు. కస్టమర్లకు ఐఫోన్ 16 వేగవంతమైన డెలివరీపై బిగ్‌బాస్కెట్‌ సీఈవో హరి మేనన్‌ మాట్లాడారు. యాపిల్ కస్టమర్లు అత్యాధునిక టెక్నాలజీని ఎటువంటి వెయిటింగ్‌ పీరియడ్‌ లేకుండా ఎంజాయ్‌ చేసేలా చేస్తామని తెలిపారు.

"ఎలక్ట్రానిక్‌ విభాగంలో మా ప్రస్థానానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అత్యంత వేగంగా వస్తువులు డెలివరీ చేయడంతోపాటు మేము.. మా కస్టమర్లు అత్యాధునిక టెక్నాలజీని ఎటువంటి వెయిటింగ్‌ పీరియడ్‌ లేకుండా ఎంజాయ్‌ చేసేలా చేస్తాం. త్వరలోనే అడ్వాన్స్​డ్ ఎలాక్ట్రానిక్‌ డివైజెస్​ను అందుబాటులోకి తెస్తాం." - హరి మేనన్‌, బిగ్‌బాస్కెట్‌ సీఈవో

ఈ సేవలు ఎప్పటి నుంచి?

  • ఎంపిక చేసిన నగరాల్లో నేటినుంచి టాటా గ్రూప్‌ ఈ సేవలను మొదలుపెట్టింది.
  • ప్రస్తుతం ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయిల్లో ఈ సేవలు మొదలయ్యాయి.
  • కాకపోతే ఇప్పటివరకు ఈ మోడల్‌ ఫోన్లపై ఆఫర్లను బిగ్‌బాస్కెట్‌ ప్రకటించలేదు.

మెరుపు డెలివరీలపై బ్లింకిట్‌ ఫోకస్:

  • మరోవైపు బ్లింకిట్‌ కూడా ఐఫోన్‌16 మెరుపు డెలివరీలపై దృష్టిపెట్టింది.
  • ఇందుకోసం యూనికార్న్‌ సోర్స్‌తో ఒప్పందం చేసుకొంది.
  • ఇది కూడా ఐఫోన్‌ ఆర్డర్‌ పెట్టిన కేవలం 10 నిమిషాల్లో వినియోగదారుడికి డెలివరీ చేస్తానని చెబుతోంది.
  • తాజాగా పలు ఇన్‌స్టెంట్‌ డెలివరీల్లో బ్లింకిట్‌ ఆఫర్లను ప్రకటించింది.
  • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కొటక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్లను పొందొచ్చు.

ఐఫోన్‌ 16 సేల్స్:

  • ఐఫోన్‌ 16 విక్రయాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
  • వీటికోసం కొనుగోలుదారులు యాపిల్‌ స్టోర్‌ల ముందు బారులు తీరారు.
  • ముంబయి, దిల్లీతో సహా పలు యాపిల్‌ స్టోర్ల బయట వారు పెద్దఎత్తున క్యూ కట్టారు.
  • దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెజాన్ కిక్‌స్టార్టర్‌ డీల్స్‌ రివీల్- స్మార్ట్‌ఫోన్లపై అందిస్తున్న ఆఫర్లు ఇవే! - Amazon Announces Offers on Mobiles

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

Last Updated : Sep 20, 2024, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.