ETV Bharat / sports

రాజస్థాన్ రాయల్స్​ కోటలోకి మరో మాజీ టీమ్​ఇండియా కోచ్‌ - ఎవరంటే? - Rajasthan Royals IPL 2025 - RAJASTHAN ROYALS IPL 2025

IPL 2025 Rajasthan Royals Batting Coach : రాజస్థాన్‌ రాయల్స్ వచ్చే సీజన్‌ కోసం తన జట్టులో మరో మాజీని తీసుకుంది. ఎవరంటే?

source Associated Press
IPL 2025 Rajasthan Royals (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 2:09 PM IST

IPL 2025 Rajasthan Royals Batting Coach : 2025 ఐపీఎల్​ కోసం రాజస్థాన్‌ రాయల్స్ జట్టు ఎంపికపై కసరత్తు మొదలు పెట్టేసింది. టైటిల్​ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రాజస్థాన్ తమ జట్టును పటిష్ఠం చేసుకుంటోంది. అందులో భాగంగా కోచింగ్‌ బృందంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ను హెడ్ కోచ్,​ మెంటార్‌గానూ తీసుకుంది. తాజాగా బ్యాటింగ్ కోచ్​ను కూడా నియమించుకుంది. తన కోటరీలోకి భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాఠోడ్‌ను ఎంపిక చేసుకుంది. ఈ మేరకు రాజస్థాన్‌ అధికారికంగా ప్రకటన జారీ చేసింది.

ఇక తనను ఎంపిక చేసుకున్న ఫ్రాంచైజీకి విక్రమ్‌ రాఠోడ్​ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 'రాజస్థాన్‌ కుటుంబంలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. గొప్ప గౌరవంగా భావిస్తున్నా. జట్టులో చాలామంది టాలెంటెడ్‌ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీ విజన్‌కు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తా. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చాలామంది భారత జట్టుకు ఆడారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం' అని రాఠోడ్‌ తెలిపారు.

నెం 1గా చేస్తాం! : రాహుల్ ద్రవిడ్
ఫ్రాంచైజీకి విక్రమ్ బ్యాటింగ్​ కోచ్​గా కొత్తగా నియామకమైన విక్రమ్​కు ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. గతంలో తనతో కలిసి పని చేసిన సందర్భం గురించి చెప్పాడు. 'విక్రమ్‌తో కలిసి కొన్నేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. అతడి వ్యూహాలు, అనుభవం, కామ్‌గా ఉండే గుణం, భారత్‌లోని పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన విక్రమ్‌ రాజస్థాన్‌కు సరిగ్గా సరిపోతాడు. టీమ్‌ఇండియాను విజయవంతంగా నడిపించిన తర్వాత ఇప్పుడు కలిసి పని చేయబోతున్నాం. యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంలో విక్రమ్‌ ముందుంటాడు. తప్పకుండా రాజస్థాన్​ను ప్రపంచస్థాయి జట్టుగా తయారు చేస్తామనే నమ్మకం ఉంది' అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.

హాలీవుడ్ - బాలీవుడ్

కాగా, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్ ప్రస్తుతం రాజస్థాన్​ బౌలింగ్ కోచ్​గా కొనసాగుతున్నాడు. ఇక బ్యాటింగ్​ కోచ్​గా విక్రమ్ రాఠోడ్ ఎంపికను ఖాయం చేస్తూ రాజస్థాన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. హాలీవుడ్ - బాలీవుడ్ అంటూ క్యాప్షన్ జత చేస్తూ షేన్ బాండ్, విక్రమ్ ఫొటోను పోస్ట్ చేసింది.

ఇట్స్ IPL టైమ్- రాజస్థాన్​కు​ కోచ్​గా ద్రవిడ్?

మళ్లీ రాజస్థాన్ గూటికి చేరిన రాహుల్ ద్రావిడ్ - కీలక బాధ్యతలు చేతిలో! - Rahul Dravid Rajasthan Royals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.