కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల బీభత్సం - దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన జోగి అనుచరులను అడ్డుకున్న స్థానికులు - YSRCP Leaders Attack - YSRCP LEADERS ATTACK
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 6:38 PM IST
YSRCP Attack TDP Leaders in Krishna District : కృష్ణాజిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నారు. పెనమలూరు నియోజవర్గంలోని పోరంకి, కానూరు, తాడిగడప పోలింగ్ కేంద్రాల్లో జోగి రమేశ్ అనుచరులు భారీగా మోహరించారు. ఇబ్రహీంపట్నం, పెడన నుంచి దొంగ ఓట్లు వేసేందుకు జోగి అనుచరులు వస్తున్నారని ఆరోపించారు. పోరంకి, కానూరులోనూ దొంగ ఓట్లు వేసేవారిని బోడె ప్రసాద్ అనుచరులు అడ్డుకున్నరు. అధికార నేతలు దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
పెనమలూరు తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త వీర్ల రాజేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తాడిగడప పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరంకి హైస్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బోడె ప్రసాద్, ఆయన వర్గీయులపై జోగి రమేశ్ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వైఎస్సార్సీపీ నేతలు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ కారుపై వైఎస్సార్సీపీ అభ్యర్థి వంశీమోహన్ అనుచరులు దాడి చేశారు. యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలను ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించారు.