ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'బాలకృష్ణ అభివృద్ధికి ఆకర్షితులయ్యాం' - చిలమత్తూరులో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు - 10 YSRCP MPTCs Joining TDP - 10 YSRCP MPTCS JOINING TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 8:19 PM IST

YSRCP 10 MPTCs Joining TDP in Chilamathur : శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 15 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీల్లో 10 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరామని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు కోసం పోలీసులు భారీగా వచ్చారు. ప్రస్తుతం ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డిని తప్పించి టీడీపీ ఎంపీపీని ఎన్నుకునేందుకు టీడీపీ అధిష్టానం సర్వం సిద్ధం చేసింది. 

నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చాక పార్టీ మారిన ఎంపీటీసీలతో కలిసి కొత్త ఎంపీపీని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలలో జరగాల్సిన చిలమత్తూరు మండల సర్వ సభ్య సమావేశం రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది. తదుపరి సమావేశం 90 రోజులకు జరుగుతుందని ఎంపీడీవో రామకుమార్ తెలిపారు. భవిష్యత్తులో జరిగే మండల అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికీ మద్దతు ఇచ్చి సజావుగా పాలన సాగేందుకు కృషి చేస్తామన్నట్లు ఎంపీడీవో వెల్లడించారు.   

ABOUT THE AUTHOR

...view details