ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Live వైఎస్ వివేకా హత్యపై కుమార్తె సునీత పవర్​పాయింట్ ప్రజెంటేషన్- కడప నుంచి ప్రత్యక్ష ప్రసారం - Sunitha Press Meet - SUNITHA PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 4:06 PM IST

Updated : Apr 30, 2024, 5:07 PM IST

 YS Viveka Daughter Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకనంద రెడ్డి కుమార్తె వెఎస్ సునీత రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. అవినాష్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలపై ఆరోపణలు చేశారు. గతంలో సైతం పలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే, ఈ సందర్భంగా మాట్లాడి ఆమె సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ అన్నా, సీబీఐ అన్నా నమ్మకం లేదని ఆరోపించారు. తన తండ్రి హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారని సీఎం జగన్​ను ఉద్దేశించి పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని అంటూ తప్పు చేసుంటే తనకైనా, తన భర్తకైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. పులివెందులలో మీడియాతో మాట్లాడిన సునీత పులివెందులలో సీఎం జగన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని, ఏం పాపం చేశారని వివేకాపై మీకు ఇంత ద్వేషం అని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్ వివేక హత్య, అనంతరం పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్​కు సిద్దమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.. 
Last Updated : Apr 30, 2024, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details