Live: కడపలో వైఎస్ సునీత మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - YS Sunitha Media Conference - YS SUNITHA MEDIA CONFERENCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 4:03 PM IST
|Updated : May 11, 2024, 4:19 PM IST
YS Sunitha Media Conference in Kadapa Live: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సింగల్ ప్లేయర్గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని భారతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. భారతి 'నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగల్ ప్లేయర్గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ' అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు.సీఎం జగన్ను ఎదిరించి మాట్లాడే సత్తా వివేకాకు ఉంది కాబట్టే కోపంతో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఏమైనా పోలీసా లేక సీబీఐనా లేక కోర్టా అంటూ నిలదీశారు. నిందితుడు అవినాష్ రెడ్డి చెబుతున్న మాటలు నమ్ముతున్న జగన్ నా ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు
Last Updated : May 11, 2024, 4:19 PM IST