ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విమలమ్మ కొడుక్కి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారు- ఆర్థికంగా బలపడి అన్నీ మరిచిపోయారు: షర్మిల - Sharmila Counter to Vimala Reddy - SHARMILA COUNTER TO VIMALA REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 5:10 PM IST

YS Sharmila Counter to Vimala Reddy : మేనత్త విమలమ్మ విమర్శలపై పీసీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘటుగా స్పందించారు. విమలమ్మ కుమారుడికి జగన్‌ కాంట్రాక్టులు ఇచ్చారని ఆర్థికంగా బలపడినందునే విమలమ్మ అన్నీ మరచిపోయారని చెప్పారు. చనిపోయింది సొంత అన్న అని కూడా విమలమ్మ మరిచిపోయినట్లు ఉన్నారని అన్నారు, వివేకాపై కృతజ్ఞత లేకుండా ఎంపీ అవినాష్‌ రెడ్డి, సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి విమలమ్మ వత్తాసు పలికేందుకు కారణమేంటని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య విషయంలో తాము ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదని, హత్యకేసులో ఆధారాలున్నందునే గట్టిగా చెబుతున్నామని షర్మిల పేర్కొన్నారు. సీబీఐ చూపించిన ఆధారాలు మాత్రమే తాము ఎత్తి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. మళ్లీ అన్యాయం జరగకూడదనే అక్కాచెల్లెళ్లం పోరాడుతున్నామని అన్నారు. హత్యా రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటమని తెలిపారు. విమలమ్మకి వయసు మీద పడిందని,  అందులోనూ ఎండా కాలం కాబట్టి అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details