హైటెక్ సిటీలో అర్థరాత్రి బైక్‌లపై ఆకతాయిల హంగామా - హైటెక్ సిటిలో ఆకతాయిల హంగామా
Published : Mar 4, 2024, 8:52 PM IST
Youth Held Bike Stunts In Hi-Tech City : వారికి భయం లేదు, బాధ్యత లేదు. తమ ప్రాణాలతో చెలగాటమాడటమే గాకుండా ఇతరుల ప్రాణాలకు యమదూతలుగా మారుతున్నారు. చీకటి పడిందంటే చాలు, నగరంలో కొందరు ఆకతాయిలు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తూ, వచ్చి పోయే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఆర్ధరాత్రి వేళల్లో ఆకతాయిల హంగామా సృష్టిస్తున్నారు. కార్లు బైకులతో రేసింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఐకియా నుంచి గచ్చిబౌలి వెళ్ళే మార్గం, రాయదుర్గం నుంచి కేబుల్ వంతెన వైపు వెళ్లే మార్గాల్లో భీభత్సం సృష్టిస్తున్నారు.
Hi-Tech City Bike Stunts : ద్విచక్ర వాహనాలు, కార్లతో స్టంట్లు చేస్తున్న యువకులు ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో సైతం పోస్టు చేస్తున్నారు. వారాంతాల్లో అ రోడ్డు గుండా వెళ్లాలంటేనే వాహన దారులు హడలెత్తుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఆర్ధరాత్రి దాటాక ఈ తతంగమంతా నడుస్తున్నా పోలీసులు పట్టించుకోట్లేదని, చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులను కొందరు వేడుకుంటున్నారు.