ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మంత్రి అంబటి కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ - యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 5:47 PM IST

Youth Congress Protest at Minister Ambati Camp Office: రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యువజన కాంగ్రెస్​ నేతలు యత్నించారు. మెగా డీఎస్సీ అంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో మంత్రి అంబటి కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ క్రమంలో మరికొంతమంది యువజన కాంగ్రెస్​ నేతలు, మంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్న వైఎస్సార్​సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 

ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఉన్న వైఎస్సార్​సీపీ నేతలు ఆందోళనకారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే, తమపై వైఎస్సార్​సీపీ నేతలు దాడి చేశారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details