తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారత్‌లోనే యంగెస్ట్‌ స్టూడెంట్‌ పైలట్​గా హైదరాబాద్ కుర్రాడు - 16 ఏళ్లకే ఎలా అయ్యాడో తెలుసా? - Rakshit Youngest Student Pilot

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2024, 2:47 PM IST

Youngest Student Pilot in India Rakshit : పైలట్ కావాలి. గాల్లో ఎగరాలి. అనేది నేటి యువత ఆలోచన. కానీ, దానిపై అవగాహన అంతంత మాత్రమే. పైలట్‌ కావాలని కలలు కన్నా, అది అనుకున్నంత సులభం కాదు. దానికెంతో ఓర్పు, శిక్షణ అనేది చాలా అవసరం. ఆ యువకుడు మాత్రం చిన్ననాడే పైలట్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇష్టమే అతడిని భారత్‌లోనే యంగెస్ట్‌ స్టూడెంట్‌ పైలట్‌గా నిలిచేలా చేసింది. 95 గంటల ఫ్లై అవర్స్ కూడా పూర్తి చేసుకుని, 16 ఏళ్ల వయస్సులోనే స్టూడెంట్ లైసెన్స్ తీసుకున్నాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన యువ పైలట్ రక్షిత్‌. 

ఇటీవల హైదరాబాద్​ బేగంపేట ఎయిర్​పోర్టులో జరిగిన వింగ్స్ ఇండియా 2024లో అందరి దృష్టిని ఆకర్షించిన రక్షిత్, 2021లో శిక్షణ ప్రారంభించాడు. 95 గంటల ఫ్లై అవర్స్ పూర్తి చేసుకుని స్టూడెంట్ లైసెన్స్ సంపాదించాడు. అతి చిన్న వయసులో ఈ లైసెన్స్ పొందిన వారిలో దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు రక్షిత్. మరి ఈ పైలట్‌ కోర్సు ఎలా ఉంటుంది? ఇక్కడి వరకు రావడానికి రక్షిత్ ఎంచుకున్న మార్గమేంటి? పైలట్‌గా రాణించాలనుకునే వారికి అతడు ఎలాంటి సూచనలు చేస్తున్నాడు? అనే అంశాలను రక్షిత్‌ను అడిగి తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details