తెలంగాణ

telangana

ETV Bharat / videos

చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన యువకుడు - రాష్ట్ర స్థాయిలో 794వ ర్యాంకుతో ఏఈఈ ఉద్యోగం - Young Man got AEE Job in Mothkur - YOUNG MAN GOT AEE JOB IN MOTHKUR

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 9:34 PM IST

Young Man From Mothkur got AEE Job : చదువుకు పేదరికం అడ్డు కాదని ఓ యువకుడు మరోసారి రుజువు చేశాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఔరా అనిపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం కొండగడపకు చెందిన బుంగ సోమయ్య- ప్రమీల కుమారుడు నాగరాజును ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఆత్మవిశ్వాసంతో నాగరాజు పట్టుదలతో చదివాడు. 

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 794వ ర్యాంక్‌ పొంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు. దీంతో నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందని నాగరాజు పేర్కొన్నాడు. దీంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఘనత సాధించేందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతో సహకరించారని నాగరాజు తెలిపారు. వెబ్ ​ఆప్షన్​లో పెట్టిన డిపార్ట్​మెంటే రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details