మంథనిలో నకిలీ ఫోన్‌పేతో మోసం - జిరాక్స్ సెంటర్లో పట్టుబడిన యువకుడు - Fake Phonepe Fraud in Peddapalli - FAKE PHONEPE FRAUD IN PEDDAPALLI
Published : Aug 5, 2024, 5:09 PM IST
Young Man Cheating with Fake Phonepe : భయ్యా ఫోన్‌పే చేస్తా క్యాష్ ఇస్తారా అంటూ ఓ యువకుడు నకిలీ ఫోన్‌పేతో జిరాక్స్ సెంటర్ యజమానిని బురిడీ కొట్టించి మోసం చేశాడు. మళ్లీ అదే పనిగా మరోసారి వెళ్లగా యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడి ఫోన్‌పే స్కాం బయటపడింది. పెద్దపెల్లి జిల్లా మంథని బస్టాండ్ సమీపంలోని ఓ ఆన్లైన్ & జిరాక్స్ సెంటర్‌కు రాజ్ కుమార్ అనే యువకుడు వచ్చి ఫోన్‌పే చేసి డబ్బులు తీసుకుంటుండగా షాప్ నిర్వాహకుడికి అనుమానం వచ్చింది.
దీంతో ఆ యువకుడు చేసిన ఫోన్‌పే డబ్బులు రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం కూడా ఆ యువకుడు ఇలాగే షాప్‌కు వచ్చి డబ్బులు ఫోన్‌పే చేసి నగదు తీసుకెళ్లాడని జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. నకిలీ ఫోన్‌పేతో మోసం చేస్తున్న వ్యక్తి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లికి చెందిన బండారి రాజ్ కుమార్‌గా గుర్తించారు.