ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి విడుదల రజిని హల్​చల్ - VIDADALA RAJINI HALCHAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 6:32 PM IST

vidadala rajini Comments: వైసీపీ నేత గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని పోలింగ్ కేంద్రంలో హల్​చల్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు విడదల రజిని ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏటి అగ్రహారంలోని ఎస్‌.కె.బి.ఎం స్కూల్‌ వద్ద ఉన్న టీడీపీ పోలింగ్‌ ఏజెంట్‌పై మంత్రి రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ పోలింగ్‌ ఏజెంట్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తన అనుచరగణంతో అక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. 

ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి విడదల రజిని లేనిపోని ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేశారని మండి పడ్డారు. పోలీసుల ముందు మంత్రి దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.  ఈ ఘటనపై ఎన్నికల అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం ఓటమి భయంతోనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details