ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు - వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలను అడ్డుకున్న ప్రజలు - YCP Leaders Illegal Sand Mining

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 5:42 PM IST

YCP Leaders Illegal Sand Mining in Guntur District : గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడులో ఎటువంటి అనుమతులు లేకుండానే ఇష్టారీతన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. కొర్నేపాడులో జగనన్న కాలనీ కోసం కొనుగోలు చేసిన భూమిలో భారీ ప్రొక్లెయిన్ తో లారీల్లో మట్టిని గుంటూరుకు తరలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 ఎకరాల వరకు మట్టి తవ్వకాలు చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

Illegal Sand Mining Mafia In AP : ఒక్కో లారీ మట్టిని రూ. 8000 వరకు విక్రయిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల మట్టిని వైఎస్సార్సీపీ నాయకులు దోచేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు అరాచకాలను చూస్తూ ఉండలేక కొంతమంది గ్రామస్థులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో అధికారులు రెండు లారీలను పోలీస్ స్టేషన్​కి తరలించారు. అనంతరం ప్రొక్లెయిన్​ను వదిలేయడంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details