ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గేట్లు వేసి మరీ వైఎస్సార్‌ ఆసరా సమావేశం - తోసుకుని వెళ్లిపోయిన మహిళలు - People problems in YCP meetings

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 9:48 PM IST

YCP Leaders Held YSR Aasara Meeting by Closing Gates: వైసీపీ నేతల్లో భయం రోజురోజుకు ముదురుతోంది. సభకు ప్రజలను బలవంతంగా తరలించడమే కాకుండా వారిని నిర్భంధించి సమావేశాలు నిర్వహించే ఆలోచనకు దిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గేట్లు వేసి వైయస్సార్‌ ఆసరా సమావేశం నిర్వహించి బలవంతంగా మహిళలను తరలించడమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే  ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. అందుకు భారీ ఎత్తున మహిళలను సమావేశానికి తరలించారు. 

సమావేశం ఆలస్యం కావడంతో మహిళలందరూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వహకులు గేట్లు వేసి నిర్భంధించారు. ఎమ్మెల్యే జోగారావు ప్రసంగిస్తుండగా పాఠశాల విడిచి పెట్టే సమయం అయిందని, తమ పిల్లలు ఎదురు చూస్తారంటూ మహిళలు గేటు నెట్టుకొని కొంతమంది బయటికి వెళ్లిపోయారు. నిర్వాహకులు మళ్లీ గేటు వేసి వారిని కొంత సమయం నిర్బంధించారు. ఇంకా ఆలస్యం అవుతుండటంతో సమావేశం పూర్తి కాకుండానే ఉన్న వారు కుడా గేట్లు తోసుకొని బయటకు వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details