ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంబటి మురళీ నీకిది తగునా! చెప్పులకు కాపలాగా అనుచరుడు - One guard for YCP leader Footwear - ONE GUARD FOR YCP LEADER FOOTWEAR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 10:07 AM IST

YCP Leader Murali Krishna Guard Man For Footwear: వైసీపీ నేతల అహంకారానికి అద్దం పట్టే సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఓ అనుచరుడు నాయకుడి చెప్పులకు కాపలా కాసి వాటిని పట్టుకెళ్లి వేసుకునేందుకు అనువుగా పెట్టినా ఆ నేత ఏ మాత్రం వారించకపోవడం చర్చకు దారితీసింది. రంజాన్‌ సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నూరులోని ఈద్గా వద్దకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వచ్చారు. మురళీకృష్ణ కారు దిగి చెప్పులు విడవగానే అదే కారులోంచి దిగిన ఓ అనుచరుడు ఆ పాదరక్షలను చేతితో తీసి పక్కన పెట్టి వాటికి కాపలాగా ఉండిపోయారు. 

మురళీకృష్ణ రెడ్‌కార్పెట్‌పై నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికి ఆయన తిరిగొస్తుండటం గమనించిన అనుచరుడు చెప్పులను పట్టుకెళ్లి నేత కాళ్ల ముందుపెట్టారు. ఇదేదో అతిగా ఉందని భావించిన మిగతా అనుచరులు ఆ దృశ్యాన్ని ఫొటో తీయకుండా చుట్టూ చేరి జాగ్రత్తపడ్డారు. అయినా కొందరు ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. మురళీకృష్ణ అహంకారం పరాకాష్టకు చేరుకుందని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. 

ABOUT THE AUTHOR

...view details