ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ అసమ్మతి నేతల రహస్య సమావేశం - పార్టీలో కలకలం - Dissident leaders of Gajuwaka

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 7:31 AM IST

YCP Incharge Issue in Gajuwaka : విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికే మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని సోమవారం రాత్రి గాజువాకలో ఓ హోటల్​లో అసమ్మతి నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఇమ్రాన్, రామారావు, వంశీరెడ్డి, మరో ఇద్దరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ చినతల్లి, వార్డు కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ విభాగాల ఇన్​ఛార్జ్​లు పాల్గొన్నారు. 64వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జి డి.శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కాదని కొత్త ఇన్​ఛార్జి ఉరుకూటి రామచంద్రకు టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే వర్గం తేల్చిచెప్పింది. విశాఖలో వైసీపీ తరపున ఎంపీగా బరిలో నిలవబోతున్న బొత్స ఝాన్సీ గెలవాలంటే గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే సహకారం ఉండాలని ఈ అంశంపై అధిష్టానం పునరాలోచించుకోవాలన్నారు. లేకపోతే తామంతా ప్రత్యామ్నాయం చూసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ విషయంపై ఒకటి, రెండు రోజుల్లో బొత్స ఝాన్సీతోపాటు, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జి సుబ్బారెడ్డిని కలవాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున భీమిలిలో సభ ఏర్పాట్లు జరుగుతున్న వేళ గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి అనుచరుల రహస్య సమావేశం జరగటం వైఎస్సార్సీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details