తెలంగాణ

telangana

ETV Bharat / videos

యాదాద్రిలో టెంకాయ కొట్టేందుకు భక్తుల తిప్పలు - Yadadri temple News

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 2:13 PM IST

Yadadri Temple Coconut Issues  : పుణ్య క్షేత్రాలలో భక్తులు దేవునికి మొక్కులు సమర్పిస్తుంటారు. మొక్కుల్లో ప్రధానంగా టెంకాయ కొట్టడం ముఖ్యమైందిగా భావిస్తారు. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాద్రాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టేందుకు వచ్చిన భక్తులకు తిప్పలు తప్పడం లేదు. మొక్కులు చెల్లించడానికి టెంకాయలతో వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది కాంప్లెక్స్‌ ప్రవేశం వద్దే నిలిపివేస్తున్నారు. క్షేత్రాభివృద్ధి తర్వాత మొక్కులను తీర్చుకునేందుకు ప్రధానాలయం దరిదాపుల్లో కాకుండా ఆంజనేయస్వామి గుడి చెంత అవకాశం కల్పించారు. టెంకాయ మొక్కు గతంలో గర్భగుడిలోని స్వయంభూల వద్దే సమర్పించేవారు. ఇ

ఆ తర్వాత గర్భాలయం గడప దాటి ధ్వజస్తంభం ప్రాంగణానికి పడమటిరాజ గోపురం ఎదుటకు చేర్చారు. ప్పుడేమో అధికారులు విష్ణు పుష్కరిణి(గుండం) దగ్గర టెంకాయలకు కొట్టవచ్చని చెబుతున్నారని భక్తులు వాపోతున్నారు. టెంకాయ మొక్కులు ఎక్కడ తీర్చుకోవాలనే సూచికలూ ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. దీనిపై ఆలయ డిప్యూటీ ఈవో భాస్కరశర్మను వివరణ కోరగా 'కొబ్బరి నీళ్లతో కృష్ణ శిల నేల దెబ్బ తింటుంది. డ్రైనేజీ పారుదలకు పీచు ఆటంకం కలిగిస్తుంది. దైవారాధనలు, దర్శనాలకు ఆటంకం ఏర్పడుతుందని టెంకాయ పక్కకు కొట్టించేందుకు చర్యలు తీసుకున్నామని' చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details