తెలంగాణ

telangana

ETV Bharat / videos

యాదాద్రి విద్యార్థినుల సూసైడ్​ కేసులో దోషులను శిక్షించాలి : మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి - యాదాద్రి స్టూడెంట్​ సూసైడ్​ న్యూస్

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 5:37 PM IST

Yadadri Students Suicide Update : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతి చెందిన విద్యార్థినుల్లో ఒకరైన భూక్య దివ్య మృతదేహం ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని స్వగృహానికి చేరుకుంది.

తమ కుమార్తె మృతిపై పారదర్శకంగా న్యాయ విచారణ చేపట్టాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. భవ్య మృతదేహంతో 365 జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని కోరారు. వారి ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు. 

Students Suicide In Yadadri : మరోవైపు భవ్య మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. భవ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దహన సంస్కారాల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఎక్స్​గ్రేషియో అందించి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details