యాదాద్రి పాతగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు - రేపటి నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు - Yadadri Brahmotsavam Dates 2024
Published : Feb 18, 2024, 7:06 PM IST
Yadadri Adhyayanotsavam 2024 : యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామివారి అధ్యయనోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అర్చకులు నిత్య ఆరాధన అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఆలయంలో తిరుమంజన, నవ కలశ స్థాపనను ఆలయ ప్రధాన అర్చకులతో వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి 4వ రోజు అధ్యయనోత్సవాలు కనుల విందుగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Yadadri Brahmotsavam Dates 2024 : శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Sri Lakshmi Narasimha Swamy) అధ్యయనోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యాయి. నేటితో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 19 నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు మొదలై 25న ముగుస్తాయని ఆలయ పూజారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో రామకృష్ణారావు, ఛైర్మన్ నరసింహమూర్తి పాల్గొననున్నారని ప్రకటించారు.