బంగారు గొలుసు కమ్మల కోసం మహిళను చంపి పూడ్చి పెట్టిన దుండగులు - మహిళను దారుణంగా చంపిన దొంగలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 8:18 PM IST
Women Murder In Anantapur District : రోజు రోజుకూ మానవ విలువలకు తూట్లు పడుతున్నాయన్నదానికి నిదర్శనంగా ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టారు. అనంతపురం జిల్లా నార్పల మండలంలోని బి.పప్పూరులో మహిళ దారుణహత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మి నారాయణమ్మ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపి గొలుసు, కమ్మలు తీసుకొని అరటి తోటలో పూడ్చిపెట్టారు.
Thieves Brutally Killed a Woman : కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఈ నెల 1న ఊరు చివర ఉన్న తోటకు వెళ్ళిన లక్ష్మి మూడు రోజులుగా అదృశ్యమైందని, ఆమె కోసం గాలిస్తుండగా అరటితోటలో మృతదేహం కనిపించిందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్య జరిగిన స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.