తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాలనీలో వైన్​ షాప్ - పర్మిషన్ రద్దు చేయాలని బోడుప్పల్ వాసుల ధర్నా - Boduppal Women Dharna

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 5:16 PM IST

Women Dharna To Cancel Wine Permit In Boduppal : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారిపై జనవాసాలు, విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. అపార్ట్‌మెంట్, విద్యాసంస్థలు, కాలనీల మధ్య వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇళ్ల నుంచి మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నామని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించలేదని వాపోయారు. 

Women Dharna : తమకు వెంటనే న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. న్యాయం జరగకపోతే ప్రతి రోజు ధర్నా కార్యక్రమాలు చేపడుతామని స్థానిక అపార్ట్ మెంట్ వసూలు తెలిపారు. కాలనీ వాసుల ఆందోళనకు ఏఎస్​ఐఎఫ్​ నాయకులు మద్దతు తెలిపారు. మద్యం షాపును వేరొకచోటుకు తరలించాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details