ఏరోనాటికల్ విభాగంలో రాణించడమే లక్ష్యమంటున్న యువత - Wings India 2024 news
Published : Jan 23, 2024, 3:04 PM IST
Aeronautical Engineering Students Wings India 2024 : బేగంపేట్ ఎయిర్ పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా-2024 ప్రదర్శనకు యువత అధిక సంఖ్యలో వస్తున్నారు. ఏవియేషన్ రంగంలో ఉన్న అవకాశాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ఏవియేషన్ ఆకాడమీలో చదువుతున్న ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ యువత తమ అనుభవాలను ఈటీవీతో పంచుకున్నారు. ఐదేళ్లు ఏవియేషన్ కోర్స్ ఉంటుంది. భవిష్యత్ అంతా విమానయాన రంగం మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది యువత విమానయాన రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు.
Wings India 2024 At Begumpet Airport : చిన్ననాటి నుంచే ఈ కోర్సుపై ఇంట్రేస్ట్తో చేస్తున్నామని బేసిక్ ఇంజన్ ఈ ఏవియేషన్‌లో టెక్నికల్ ఆపరేటింగ్ చూస్తామని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు అంటున్నారు. ఆపరేషన్స్‌తో పాటు ఇతర అంశాలను నేర్పిస్తారని విమానయాన రంగంలో అపార అవకాశాలు ఉన్నాయంటున్న యువతతో ఈటీవీ చిట్ చాట్. ఈ కోర్సులో బేసిక్ ఇంజిన్, వాటిలో రకాల గురించి మాకు నేర్పిస్తారని శిక్షణ విద్యార్థులు చెబుతున్నారు.