ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మళ్లీ తెరుచుకున్న శ్రీశైలం జలాశయం గేట్లు - నాగార్జునసాగర్​కు వరద ఉధృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Water Releasing From Srisailam Dam Gate Opened : అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయం ఒక గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 93,439 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు సాగర్‌ డ్యాం ఆరు క్రస్టుగేట్లు ఎత్తి 48,600 క్యూసెక్కుల నీటిని  విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 6257, ఎడమ కాలువకు 6022, ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 29,760, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 2400, లోలెవల్‌ కెనాల్‌కు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఈ సీజన్ తొలినాళ్లలో ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చింది దీంతో. శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3.11 లక్షల క్యూసెక్కులు రాగా శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి సాగించారు. విద్యుదుత్పత్తి ద్వారా 68,807 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు. 

ABOUT THE AUTHOR

...view details