తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌ - లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు - Hussain Sagar Water Level Increased - HUSSAIN SAGAR WATER LEVEL INCREASED

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 1:06 PM IST

Hussain Sagar Water Level Increased : ఆదివారం కుండపోతగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్​ నగరంలోని హుస్సేన్​ సాగర్​ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సాగర్​కు చేరుకోవడంతో తూము గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయం​ ఫుల్​​ ట్యాంక్​ లెవెల్​ దాటింది. దీని​ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు. ప్రస్తుతానికి నీటి మట్టం 513 మీటర్లు దాటింది. 

ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్​ సాగర్​లో చేరుతుంది. 4 గేట్ల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్​ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఇన్​ఫ్లో ఎక్కువగా వస్తే, ఔట్​ ఫ్లో కూడా ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.  

ABOUT THE AUTHOR

...view details