పెట్రోల్‌లో నీళ్లు - తార్నాక బంక్‌లో వాహనదారుల ఆందోళన - WATER IN PETROL TARNAK BUNK - WATER IN PETROL TARNAK BUNK
Published : Aug 19, 2024, 12:05 PM IST
Water in Petrol in Hyderabad : హైదరాబాద్ తార్నాకలో హెచ్‌పీ ఏజెన్సీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌తో పాటు వాటర్ కూడా వస్తోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఆరు వాహనాల్లో పెట్రోల్ పోయించిన కొద్ది సేపటికే అవి మొరాయించడంతో వాహనదారులు కంగుతిన్నారు. వెంటనే పరిశీలించగా పెట్రోల్‌లో నీరు కలిసిందని గుర్తించారు. దీంతో పెట్రోల్ బంక్ వద్ద వారు ఆందోళనకు దిగారు. ఈ విషయమై పెట్రోల్ బంక్ మేనేజర్‌ను వివరణ కోరగా ఆయన నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో వాహనదారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.
తన కారులో పెట్రోల్ పోయించుకున్న ఓ వాహనదారు కొద్దిసేపటి తరువాత సమస్య రావడంతో చెక్ చేయగా పైపులో నుంచి నీళ్లు రావడంతో కంగుతిన్నారు. నేరుగా పెట్రోల్ ద్వారా ఇంజిన్లోకి వాటర్ వెళ్తే వాహనం పాడవుతుందని వాపోయారు. వాహనాన్ని రిపేర్ చేయడానికి అదనపు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా పెట్రోల్‌ను కల్తీ చేయడం కరెక్టు కాదన్నారు. పెట్రోల్ పంప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.