సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చా : కడియం కావ్య - Warangal MP Kadiyam Kavya Mukha Mukhi - WARANGAL MP KADIYAM KAVYA MUKHA MUKHI
Published : Jun 5, 2024, 3:26 PM IST
Warangal MP Kadiyam Kavya Interview on Success : కాంగ్రెస్ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా గెలుపొందిన కడియం కావ్య సాధారణ వైద్యురాలిగా సేవలందించారు. సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంకోవైపు ఆమె తండ్రి కడియం శ్రీహరికి అపార రాజకీయ అనుభవం ఉంది. అయితే కావ్య వరంగల్ ప్రాంత ప్రతినిధిగా ఎన్నికవ్వడం గొప్ప అదృష్టం అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గతంలో నాన్నకు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన సలహాలు సూచనలతో ముందుకెళతానని చెప్పారు. విమానాశ్రయం ఏర్పాటు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు, ఓరుగల్లులో ఐఐఎం సంస్థను తీసుకొచ్చేలా పార్లమెంటులో గళమెత్తుతానని స్పష్టం చేశారు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని వరంగల్ ఎంపీ కావ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి భారీ ఆధిక్యతతో వరంగల్ ఎంపీగా గెలుపొందిన సందర్భంగా ఆమె ఈటీవీ భారత్తో తన భవిష్యత్ ఆలోచనలను పంచుకున్నారు.