మోడల్ పోలింగ్ కేంద్రం: ముగ్గులు వేసి- పందిరి వేసి- ముస్తాబు చేసి - MODEL POLING STATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 8:10 PM IST
Voter Awareness Program in Kurnool District : సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్కు రప్పించటం కోసం కేంద్రలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల్లో ఆదర్శ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు సేదతీరడానికి షామియనా ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రం ముందు పందిరి వేసి ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు.
అదేవిధంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా మ్యాట్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గత మూడు నెలలుగా ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించిన్నట్లు స్పష్టం చేశారు. ఓటరు స్లిప్ లేకపోయినా 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని చెప్పారు. ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.