ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వాలంటీర్‌పై వేటు - బీఎల్‌ఓను విధుల నుంచి తొలగించిన అధికారులు - Volunteer distributed voter slips - VOLUNTEER DISTRIBUTED VOTER SLIPS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 10:38 PM IST
Volunteer Distributed Voter Slips in Pamarru of Krishna District : ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఈసీ జారీ చేసిన ఆదేశాలను కొందరు అధికారులు, వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. తాజాగా ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కి ఓ వాలంటీర్ ఓటర్ స్లిప్పులను పంపీణీ చేశాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పామర్రులో జరిగింది. ఎన్నికల సంఘ ఆదేశాలను పక్కకు నెట్టి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్న వాలంటర్ పై పలువురు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పామర్రు పట్టణంలో మంగళవారం రాత్రి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విచారణ చేపట్టారు.
Election Commission Orders on Volunteers : ఈ నేపథ్యంలో ఓటర్లకు అందించే ఓటరు స్లిప్పులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతం ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాల్సిన బీఎల్ఓ రాజునే వాలంటీరుని భాగస్వామ్యం చేసినట్లు తెలింది. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ఓ రాజుతోపాటు వాలంటీర్ ప్రసాద్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పేర్కొన్నారు.