YUVA : వైకల్యాన్ని జయించి - ఐఐఎం ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన యువతి - student excelled in IIM entrance
Published : Jun 25, 2024, 5:41 PM IST
Blind student who excelled in IIM entrance exam : లక్ష్య సాధనకు శరీరక లోపం ఏ మాత్రం అడ్డం కాదని నిరూపించిందా ఆ అమ్మాయి. పుట్టుకతోనే 100 శాతం అంధత్వం ఉన్నా, జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో వంద శాతం సత్తాచాటింది. 2023లో నిర్వహించిన క్యాట్ పరీక్షల్లో పోటీపడి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. దేశంలో ఉన్న 21 ఐఐఎమ్ కళాశాలల్లో 19 కళాశాలలకు అర్హత సాధించి పలువురి మన్ననలను అందుకుంటుంది. మరి, ఇంతకీ ఎవరా విద్యాకుసుమం...? పరీక్షల కోసం ఎలా సన్నద్ధమైంది..? భవిష్యత్తు లక్ష్యమేంటో ఆమె మాటల్లోనే విందాం.
పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తల్లీదండ్రులకు చక్కటి ఆనందాన్ని పంచుతుంది శివాని. పదో తరగతి, ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన శివాని చెన్నైలోని బీబీఏ కోర్సు పూర్తి చేసింది. క్యాట్ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకున్న శివాని 2023లో నిర్వహించిన ఐఐఎం ప్రవేశపరీక్షల్లో సత్తాచాటి ఇండోర్ కళాశాలను ఎంపికచేసుకుంది. చదువు పూర్తి అయిన తర్వాత మల్టీనేషన్‌ల పరిశ్రమల్లో తాను ఉన్నత స్థాయిలో పనిచేయాలనుకుంటున్న శివానితో ఈటీవీ భారత్ ముఖాముఖి.