షాద్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం- కంటైనర్ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి - Road Accident in Shadnagar - ROAD ACCIDENT IN SHADNAGAR
Published : Apr 10, 2024, 5:19 PM IST
Viral Video Man Died in Road Accident in Shadnagar : రంజాన్ పండగ వేళ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన అక్కడున్న స్థానికులతో పాటు వాహనదారులను సైతం కలచివేసింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. షాద్‌నగర్ ఎస్సై నయీం తెలిపిన వివరాల ప్రకారం, షాద్‌నగర్ పురపాలక ఫరూక్‌నగర్‌లో నివసించే మహమ్మద్ అబ్దుల్ సలీం(49) పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తున్నాడు.
Road Accident at Shadnagar in RangaReddy : బుధవారం పట్టణంలోని జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా నాందేడ్‌కు చెందిన కంటైనర్ హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తూ సలీంను ఢీకొట్టింది. ఈ క్రమంలో సలీంపై కంటైనర్ వెళ్లడంతో అతడు అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సలీం కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నయీం తెలిపారు.