తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వినాయకచవితి పూజ - Vinayaka Chavithi in BJP Office - VINAYAKA CHAVITHI IN BJP OFFICE

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 11:22 AM IST

Updated : Sep 7, 2024, 11:52 AM IST

Vinayaka Chavithi Festival in BJP Party Office : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్​లోని నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఏటా అత్యంత వైభవంగా జరుపుకునే ఉత్సవాల్లో ఇది పెద్ద పండుగ. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు వినాయక చవితి పురస్కరించుకుని బొజ్జగణపయ్యకు పూజలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలును ఉద్దేశించి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకున్న విఘ్నాలన్నీ తొలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. గణేశ్​ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సైతం పూజలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపయ్యను తలచుకుంటున్నారు. మరోవైపు పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మట్టి గణపతిని పూజిద్దామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచిస్తున్నారు. నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న వినాయకచవితి వేడుకలను ప్రత్యక్షప్రసారంలో చూద్దాం.  
Last Updated : Sep 7, 2024, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details