'రెగ్యులర్ చేస్తూ కారుణ్యనియామకాలు ఇవ్వాలని సెక్రటేరియట్ ముందు వీఆర్ఏల ఆందోళన' - గ్రామ రెవిన్యూ సహాయకులు
Published : Mar 4, 2024, 4:41 PM IST
Village Revenue Assistants Issue : గ్రామ రెవిన్యూ సహాయకులు (వీఆర్ఏ) వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏ వారసులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమస్యపై మంత్రులు, అధికారులు చుట్టూ తిరుగుతున్న పట్టించుకోక పోవడంతో హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ఆందోళన నిర్వహించారు. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య (వారసత్వ) నియామకాల కోసం జీవో నెంబర్ 81, 85 ప్రకారం 3797 మంది 61 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకం కోసం జారీ చేశారని వారు తెలిపారు. కానీ ఈ జీవోల పైన స్టే ఉన్న కారణంగా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.
Village Revenue Assistants Dharna : హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులనుసారం జీవో నెంబర్ 81పైన ఉన్న స్టే ఎత్తివేసిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14 మంది వీఆర్ఏలు కూడా మరణించడం జరిగిందని మొత్తం 20,555 మందిలో 16758 మంది వివిధ శాఖలలో వారి వారి అర్హతలను బట్టి నియామక ఉత్తర్వులు, ఐడీలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన 3797 మందికి ఇప్పటి వరకు ఎలాంటి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందు వీఆర్ఏల వారసులకు నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు.