తెలంగాణ

telangana

ETV Bharat / videos

'హైదరాబాద్​ వస్తే గుర్తొచ్చేది ఫిల్మ్‌సిటీనే- రామోజీరావు విజన్​కు అదే నిదర్శనం' - Vijay Sethupathi About Ramoji Rao - VIJAY SETHUPATHI ABOUT RAMOJI RAO

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 7:14 PM IST

Vijay Sethupathi About Ramoji Rao : ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఇక లేరనే వార్త విన్నాక బాధగా ఉందని తమిళ హీరో విజయ్ సేతుపతి అన్నారు. ఆయన తాజా చిత్రం మహారాజ ప్రమోషన్​లో భాగంగా హైదరాబాద్​కు వచ్చిన విజయ్ సేతుపతి రామోజీ ఫిల్మ్‌సిటీతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు. 'హైదరాబాద్‌ వస్తే రామోజీ ఫిల్మ్‌సిటీనే నాకు గుర్తుకు వస్తుంది. 2005లో ధనుష్‌ సినిమా కోసం తొలిసారి ఫిల్మ్‌సిటీకి వచ్చా. అక్కడు చూశాక ఒక్క వ్యక్తి ఇంత సాధించగలరా అనిపించింది. సినిమాకు సంబంధించి ఏం కావాలో అన్నీ ఫిల్మ్‌సిటీలో కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారంటే అందులోని సదుపాయాలే కారణం. రామోజీరావు విజన్‌కు ఫిల్మ్‌సిటీనే నిదర్శనం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

రామోజీరావు సినీ పరిశ్రమకు గొప్ప సేవలందించారని సినీ నిర్మాత ఎన్​వీ ప్రసాద్ కొనియాడారు. 'అక్షరానికి కొత్త శక్తినిచ్చారు. తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని రామోజీ ఫిల్మ్‌సిటీని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు' అని నిర్మాత ఎన్​వీ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

...view details