ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా రేషన్ బియ్యం- లారీని సీజ్​ చేసిన విజిలెన్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 4:49 PM IST

Vigilance Authorities Caught Lorry Illegal Transporting Ration Rice: కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ రాజకుమార్​కు వచ్చిన సమాచారంతో స్థానిక కాజా టోల్​ ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సంఘటన గుంటూరు కాజా టోల్​ ప్లాజా వద్ద జరిగింది.

Revenue Authorities Seized The lorry at Guntur: విజిలెన్స్​ అధికారుల తనిఖీలో భాగంగా నూజివీడు నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీలో పోర్టుకు తరలిస్తున్న 620 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. సీజ్​ చేసిన లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​కు తరలించినట్లు రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. అధికారుల కళ్లు కప్పి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారనే వివరాల కోసం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని విజిలెన్స్ అధికారులు చెప్పారు. దీని వెనుకున్న నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details