తెలంగాణ

telangana

ETV Bharat / videos

జోనల్‍ స్పోర్ట్స్ ఛాంపియన్​గా నిలిచిన వనస్థలిపురం నారాయణ పాఠశాల - NARAYANA STUDENTS EXCEL IN SPORTS

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 7:51 PM IST

Narayana School Students Excel In Sports : నారాయణ పాఠశాలల దిల్‍సుఖ్‍నగర్‍ జోనల్‍ స్థాయి ఆటలపోటీల్లో వనస్థలిపురం బ్రాంచ్‍ విద్యార్ధులు విశేష ప్రతిభ ప్రదర్శించారు. నవంబర్‍ 21, 22 తేదీల్లో జరిగిన ఈ క్రీడాపోటీల్లోని పలు అంశాల్లో ఏకపక్ష విజయాలు నమోదుచేశారు. కబడ్డీ, ఖోఖో, చెస్‍, క్యారమ్స్, రన్నింగ్‍ ఈవెంట్లలో అనేక బహుమతులు పొందారు. ఈ సందర్భంగా అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న విద్యార్ధులకు నారాయణ పాఠశాల వనస్థలిపురం గ్రౌండ్‍లో అభినందన సభ నిర్వహించారు. 

కార్యక్రమంలో పాఠశాల జీఎం గోపాల్‍రెడ్డి, ఏజీఎం హేమాంబర్‍, ఆర్​ఎం రవిప్రసాద్‍, ప్రిన్సిపల్‍ భవాని తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో చక్కటి ప్రతిభ ప్రదర్శించిన చిన్నారులను వీరంతా కొనియాడారు. సమష్టిగా రాణించి జోనల్‍ స్థాయి ఛాంపియన్‍షిప్‍ సాధించారని ఈ విజయంతో పాఠశాల కీర్తిప్రతిష్ఠలను మరింతగా ఇనుమడింపజేశారని విద్యార్ధులను అభినందించారు. క్రీడాకారులు సాధించిన షీల్డులు, జోనల్‍ ఛాంపియన్‍షిప్‍ మొమెంటోలను విద్యార్ధులందరూ అపురూపంగా వీక్షించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్​లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. 

ABOUT THE AUTHOR

...view details