ETV Bharat / entertainment

వెంకీ మామ ఫ్యాన్స్​ మీట్- 3వేల మంది అభిమానులతో నాన్ స్టాప్ క్లిక్ క్లిక్! - VENKATESH MEET HIS FANS

అభిమానులతో వెంకటేశ్ ఫొటోషూట్- ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

Venkatesh Meet His Fans
Venkatesh Meet His Fans (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2025, 5:53 PM IST

Venkatesh Meet His Fans : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన అభిమానులతో కలిసి సందడి చేశారు. ఆయన లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్స్​లో భాగంగా అభిమానులతో ఫొటోషూట్ నిర్వహించారు. హైదరాబాద్​లోని రామానాయుడు స్టూడియోలో ఫొటోషూట్ ఏర్పాడు చేశారు. దీంతో ఆయనను కలిసేందుకు వందలాది మంది అభిమానులు స్టూడియోకు వచ్చారు.

ఫ్యాన్స్​ అందరిని వెంకటేశ్ చాలా ఒపిగ్గా కలిశారు. ఒక్కొక్కరితో ఫొటోలు దిగుతూ అభిమానులను సంతోషపరిచారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడం వల్ల రామానాయుడు స్టూడియో పరిసరాలు సందడిగా మారాయి. మహిళలు, యువకులు, మరికొంత మంది అభిమానులు కుటుంబ సమేతంగా వచ్చి తమ అభిమాన నటుడిని కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్​ను కలిసేందుకు దాదాపు 3 వేల మంది వచ్చారు.

ఫొటో దిగేందుకు క్యూ కట్టిన అభిమానులు (Source : ETV Bharat)

ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ మాట్లాడారు. మూవీ ఆడియెన్స్​కు కచ్చితంగా నచ్చుతుందని, దీనిపై ఫుల్ కాన్ఫిడెంట్​గా ఉన్నట్లు ఆయన తెలిపారు. 'గతంలో నేను ఎన్నో కామెడీ జానర్‌ చిత్రాల్లో యాక్ట్‌ చేశా. కానీ ఇది చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు' అని వెంకటేశ్ అన్నారు. ఇక ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్​ గురించి కూడా వెంకీ మాట్లాడారు. పొంగల్ బరిలో ఉన్న అన్ని సినిమాలు విజయాన్ని అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

కాగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కించారు. 'ఎఫ్‌ 2', 'ఎఫ్‌ 3' తర్వాత హీరో వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. బీమ్స్​ సిసిరొలియో సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాతి కానుకగా జనవరి 14న ఈ సినిమా వరల్డ్​ వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

'ఆ ప్రశ్నలు అడిగితేనే నాకు టెన్షన్ వస్తుంది'- వెంకీ మామ

'ఆయన వన్ అండ్ ఓన్లీ OG'- బాలయ్యపై వెంకటేశ్ హీరోయిన్ కామెంట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.