ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ పాలనలో వడియరాజులకు చేసిన మేలు ఏమీ లేదు : జీవీ ఆంజనేయులు - vadiyaraju meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 12:17 PM IST

Vadiyaraju Consciousness Conference at Palnadu : రాష్ట్రంలో రానున్నది టీడీపీ - జనసేన ప్రభుత్వమని, వడియరాజుల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వడియరాజ్​ సాధికార సమితి నాయకులు ఆదివారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్​ హాలులో వడియరాజ్​ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జీవీ ఆంజనేయులు, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు హాజరయ్యారు.

వైసీపీ పాలనలో వడియరాజులకు చేసిన మేలు ఏమీ లేదని జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. టీడీపీ అంటే బీసీల పార్టీ అని, ఎన్టీఆర్​ హయాం నుంచి పార్టీకి బీసీల్లో ప్రధానంగా వడ్డెరలు అండగా నిలిచి విజయాల్లో కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు వడ్డెరలకు రూ.145 కోట్లతో కార్పొరేషన్​ ఇచ్చారని, పనిముట్లు, రుణాలు ఇచ్చి అభివృద్ధికి సహకరించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో సత్యపాల్​ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్​రెడ్డి బీసీల అణిచివేత లక్ష్యంగా పాలన చేస్తున్నారని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details