LIVE : వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటన - union ministers in telangana live - UNION MINISTERS IN TELANGANA LIVE
Published : Sep 6, 2024, 1:07 PM IST
|Updated : Sep 6, 2024, 1:29 PM IST
Union Ministers Visit Flood Affected Areas in Telangana : ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఏరియల్ సర్వే చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్, బండి సంజయ్ చూశారు. వరదలకు కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను కేంద్రమంత్రులు పరిశీలించారు. మధిరలో కట్టలేరు వరదతో ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతితో ముంపునకు గురైన ప్రాంతాలను సైతం పరిశీలించారు. ఏరియల్ సర్వే తర్వాత పాలేరుకు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై చిత్ర ప్రదర్శనను కేంద్రమంత్రులు తిలకించారు. పాలేరులో దెబ్బతిన్న పంటలను కేంద్రమంత్రులు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో కేంద్రమంత్రులు మాట్లాడారు. కేంద్రమంత్రుల వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. గత శనివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో మున్నేరు వాగుకు భారీగా వరదలు వచ్చాయి.
Last Updated : Sep 6, 2024, 1:29 PM IST