తెలంగాణ

telangana

ETV Bharat / videos

2026 నాటికి సరికొత్తగా సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ - ఎలా ఉంటుందో తెలుసా? - Secunderabad Rail Station Upgrade - SECUNDERABAD RAIL STATION UPGRADE

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 8:05 PM IST

Secunderabad Railway Station Redevelopment : రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్​కు మహర్దశ రాబోతోంది. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2026 లోపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రన్వీత్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు.

ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాక పోకలు సాగిస్తున్నారని, ఒక పక్క ప్యాసెంజర్లకు ఇబ్బందులు కలగకుండా, మరోపక్క స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే సహాయ మంత్రి రన్వీత్ సింగ్ పరిశీలించారు. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రజలకు అందుబాటులోకి రాబోతుందన్నారు. జనరల్ కోచ్​ల ప్రాధాన్యత దృష్ట్యా 2 రైళ్లలో జనరల్ బోగీలను పెంచామని రన్వీత్ సింగ్ స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details