ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సెల్ఫీ తీసుకుంటుండగా విషాదం - సముద్ర స్నానానికి వెళ్లి అక్కాచెల్లెళ్లు మృతి - Two Sisters Drowned in Beach - TWO SISTERS DROWNED IN BEACH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 10:34 AM IST

Two Sisters Drowned in Thanthadi Beach: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌ వద్ద జరిగింది. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మరొకరితో కలిసి తంతడి బీచ్‌కు వెళ్లారు. ముగ్గురూ కూడా సముద్ర స్నానానికి దిగారు. అయితే బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటూ ఉండగా అలల ధాటికి కొట్టుకుపోయారు. అందరూ చూస్తుండగానే నీళ్లలో మినిగిపోయారు. గజ ఈతగాళ్ల సహాయంతో వారిని బయటకి తీయగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. 

మరొకరి పరిస్థితి విషమంగా ఉడటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటూ సముద్రం లోపలికి వెళ్లిన ముగ్గురు యువతులు అలల ఉద్ధృతి కారణంగానే సముద్రంలో మునిగిపోయారు. అక్కా చెల్లెళ్ల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఎంతో చలాకీగా ఉండే అక్కాచెల్లెళ్లు సముద్రస్నానానికి వెళ్లి ప్రమాదంలో మరణించడంతో మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

ABOUT THE AUTHOR

...view details