ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం ఘటన - ఇద్దరు అధికారులపై వేటు - Macharla EVM Vandalism - MACHARLA EVM VANDALISM

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:00 PM IST

Two officials were suspended in AP: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ( EVM ) ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్‌ కాలేజ్ లెక్చరర్‌ సుబ్బారావు, పోలింగ్ అధికారిగా ఉన్న వెంకటాపురం జడ్పీ స్కూల్‌ ఉపాధ్యాయురాలు షహనాజ్ బేగంను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

ఈవీఎం ధ్వంసం ఘటనలో పీవో, ఏపీవోల సస్పెన్షన్‌కు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకూ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు.  ఇదే అంశంపై ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయడం కోసం మెుత్తం 8 బృందాలు వెతుకున్నాయి. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన పిన్నెల్లి, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా జూన్​ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. 

ABOUT THE AUTHOR

...view details