తెలంగాణ

telangana

కోడిగుడ్లు లేవన్నందుకు దుకాణం​ యజమానిపై ఇద్దరు యువకులు దాడి - వీడియో వైరల్​ - Two Men Attack on owner For Eggs

By ETV Bharat Telangana Team

Published : Mar 26, 2024, 8:36 PM IST

Two Men Attack on Shop owner For Eggs : రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సూపర్ మార్కెట్‌ యజమానిపై యువకులు దాడి చేసిన సీసీ ఫుటేజీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మండల కేంద్రంలోని జీమార్ట్‌ సూపర్ మార్కెట్​కు గుండారం గ్రామానికి చెందిన నర్సింలు, డేవిడ్‌లు బీరు సీసాతో వచ్చారు. కోడిగుడ్లు ఉన్నాయా అని సూపర్ మార్కెట్‌ యజమాని జలపతిరెడ్డిని అడిగారు. లేవని ఆయన సమాధానం ఇచ్చారు.  

Two Men Attack on Shop owner video viral : దీంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో దుర్భాషలాడటమే కాకుండా యజమానిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నపూలకుండీని ఎత్తివేసి చంపుతామని బెదరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యజమాని పేర్కొన్నారు. ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటనతో పాటు వారిని అడ్డుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా, షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details