ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు - భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ - Tribals Attacked Narsipatnam RDO

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 1:02 PM IST

Tribals are Worried About Giving Passbooks to Forest Rights Holders : అనకాపల్లి జిల్లాలోని మైదాన ప్రాంత గిరిజనులకు అటవీ హక్కుల పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద వి.మాడుగుల, రావికమతం, రోలుగుంట ప్రాంత గిరిజనులు ఆందోళన చేశారు. రెవెన్యూ వెబ్​ ల్యాండ్​ రికార్డులు నమోదు చేయడంతో పాటు, గిరిజనులందరికీ పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు.

Tribals Attacked Narsipatnam RDO Office : వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న రీసర్వేలో సాగులో ఉన్న గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు పట్టాలిచ్చారని ఆరోపించారు. గిరిజనులకు భూ పట్టాలను పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేస్తూ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. నర్సీపట్నం ఆర్టీవో కార్యాలయం ఆవరణంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందజేసిన  600 వినతి పత్రాలకు ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details