తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాజీపేట రైల్వే స్టేషన్​ యార్డులో అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన బోగీ - కాజీపేట్ రైల్లో మంటలు

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 12:54 PM IST

Train Fire Accident In kazipet Railway Station : హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్‌ యార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పాత బోగీ కాలిపోయింది. యార్డ్​లో నిలిపి ఉంచిన రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడంతో సమీపంలోని రైల్వే స్టేషన్​లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. 

Kazipet Train Fire Accident : ఈ ఘటనలో ఒక్క బోగీ మాత్రమే అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. స్టేషన్​లోని ప్లాట్ ఫామ్​లకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్​లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడినట్లు భావిస్తున్నారు. మంటలకు కారణాలపై విచారణ జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు వివరించారు. వేసవి కాలం సమీపిస్తుండటంతో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details