ఆటోలో వెళ్తుండగా మాయమైన ఆభరణాల బ్యాగు - మంచి మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ - Traffic Constable Prabhu news
Published : Jan 28, 2024, 3:41 PM IST
Traffic Constable Humanity : పోలీసులు అంటే కేవలం తమ వృత్తి ధర్మాన్ని పాటించడమే కాదు అప్పుడప్పుడు సమాజానికి తమ వంతు సహాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంటారు. విధుల్లో భాగంగా ఓ కానిస్టేబుల్ రూ.5 లక్షల విలువైన బంగారు అభరణాలున్న బ్యాగును బాధిత మహిళకు అందించి, మంచి మనసు చాటుకొని ఉన్నతాధికారుల మన్ననలు పొందాడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఒక మహిళ ఆటోలో వెళ్తున్న క్రమంలో తన బ్యాగు కింద పడిపోయింది. ఆమె బ్యాగులో రూ.ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు రోడ్డుపై పడ్డ బ్యాగును గుర్తించి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. వెంటనే పోలీసులు అన్నపూర్ణకు సమాచారం ఇచ్చి, ప్రభు చేతుల మీదుగా ఆమెకు అందించారు. విలువైన బ్యాగును తిరిగి అందించిన ప్రభుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.